పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన గబ్బర్ సింగ్ 2 షూటింగ్ ని త్వరగా పూర్తి చేయాలనీ చూస్తునారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని పూర్తీ చేసుకుని హైదరబాద్ కి తిరిగి ముఖం పట్టింది. ఎలా ఐన ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయలని అనుకున్తునారట
పవన్ టిడిపి తో తెగదెంపులు చేసుకునే ఆలోచనలో ఉన్నారా..అంటే అవును అనే అంటునారు రాజకీయ జనాలు. అదికార టిడిపి ప్రభుత్వం రాజధాని మరియు బోగాపురం విమానాశ్రయం కోసం రైతులు దగ్గర వేల ఎకరాలు సేకరించేదుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఇది అక్కడ రైతులకు ఇష్టం లేదు అని అందరికి తెలిసిన విషయమే. ఒకవేళ భూములు ఇస్తే తమని ప్రభుత్వం అదుకున్తున్హ్డ అనే విషయం పై కూడా రైతులకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటికే భు సమీకరణ విషయం లో పవన్ పవన్ టిడిపి ప్రభుత్వం పై గుర్రుగా ఉన్నారు. రైతులకు అన్యాయం జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకం గ తప్పక ఉద్యమిస్త అని సామజిక మాద్యమం ట్విట్టర్ ద్వార పవన్ తెలిపారు కూడా.
మరి ఇప్పుడు ఆ సమయం ఆసన్నం అయ్యిందేమో కాని పవన్ ప్రభుత్వానికి వ్యతిరేకం గ పోరాడేందుకు కార్యాచరణ రుపొందిన్చుకున్ట్టునట్టు సమాచారం. భు సమీకరణ వాళ్ళ వచ్చే నష్టాలు గురించి పలువురు మేధావులతో పవన్ ఇప్పటికే మంతనాలు సాగించారట
మెగాస్టార్ చిరంజీవి రీ`ఎంట్రీ ఖరారైపోయింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 150వ సినిమా చేస్తున్న చిరంజీవి, ఈ సినిమా కోసం చాలా కసరత్తులే చేయాల్సి వస్తోంది. ఆగస్ట్‌లో సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమవుతుందని ఇటీవలే చిరంజీవి ప్రకటించేశారు కూడా.
సినిమా చిరంజీవికి కొత్త కాదు. కానీ, రాజకీయాల్లోకి వెళ్ళాక చిరంజీవి కాస్త లావెక్కారు. బాడీలో ఫ్లెక్సిబులిటీ తగ్గిపోయే వుంటుంది. సినిమాల్లో చిరంజీవి మెగాస్టార్.. డాన్సింగ్ సెన్సేషన్. అలాంటి చిరంజీవి, సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లో నటిస్తున్నారంటే, ఆయన్నుంచి బీభత్సమైన డాన్సుల్ని అభిమానులు ఆశించకుండా వుంటారా.? అందుకే మొదటగా సన్నబడేందుకు ప్రాధాన్యతనిచ్చిన చిరంజీవి, డాన్సులకూ అధిక ప్రాధాన్యతనిస్తున్నారట.
అన్నట్టు, చిరంజీవికి ఈ జనరేషన్ కొరియోగ్రాఫర్లలో బాగా ఇష్టమైనది లారెన్స్, ప్రభుదేవా. ప్రస్తుతం ఈ ఇద్దరూ అందుబాటులో వుండటంలేదు. ప్రభుదేవా బాలీవుడ్‌కి వెళ్ళిపోగా, లారెన్స్ మాత్రం తమిళ, తెలుగు సినిమాలతో కాలక్షేపం చేస్తున్నాడు.. అదీ దర్శకుడిగా, నటుడిగా. వేరే సినిమాలకు లారెన్స్ కొరియోగ్రఫీ చేయడం దాదాపు మర్చిపోయాడు. అయినాసరే, చిరు పిలుపుతో లారెన్స్, చిరంజీవి 150వ సినిమాకి కొరియోగ్రఫీ అందించడానికి ఓకే చెప్పాడట.
ఇప్పటికే చిరంజీవి క్లోజ్డ్ డోర్స్‌లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తోంటే, లారెన్స్ కూడా కొన్ని సలహాలిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే, చిరంజీవిని మునుపటిలా.. డాన్సింగ్ స్టార్లా 150వ సినిమాతో చూసే అవకాశం అభిమానులకు దక్కుతుందన్నమాట. కొసమెరుపేంటంటే చిరంజీవి ఓకే చెబితే ఆయనతో సినిమా చేయడానికి లారెన్స్ కూడా రెడీగా వున్నాడట.
చిరంజీవి - శ్రీదేవి కలిసి నటించిన "జగదేక వీరుడు అతిలోక సుందరి" సినిమా టాలీవుడ్ గర్వించదగ్గ సినిమాలలో ఒకటి. సోషియో ఫాంటసీ నేపద్యం లో తెరకెక్కిన ఈ సినిమా అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసింది. సాంకేతికంగా కూడా ఈ సినిమా తెలుగు సినిమాను మరో మెట్టు ఎక్కించింది. కే రాగవేంద్ర రావు తెరకెక్కించిన ఈ సినిమాను సి. అశ్వని దత్ బారి బడ్జెట్ తో నిర్మించారు. కొద్ది రోజుల క్రిందట ఈ సినిమా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బం గ ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తామని అశ్వని దత్ ప్రకటించారు. ఐతే ఇప్పుడు ఈ మూవీ ని 3D లో రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారట. చిరు 150 వ సినిమాతో పాటు ఈ సినిమా రీ రిలీజ్ కావడం మెగా ఫాన్స్ కు పండగే
అభిమానులు చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న సమయంలో 150వ సినిమాకి గ్రీన్ సిగ్నల్ రాగానే అభిమానుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి . ఆ సంతోషంలో ఉండగానే ఓ రచ్చ మొదలయ్యింది .
చిరంజీవి 150వ సినిమా కథ కాపీ అని యుఎస్ కి చెందిన వాసుదేవ్ వర్మ అనే రైటర్ అంటున్నాడు . ఎందుకంటే ఆ కథ నాదేనని దాన్ని బివిఎస్ రవి కాపీ కొట్టాడని ఆరోపిస్తున్నాడు . దాంతో మరో రచయిత గోపి మోహన్ స్పందించాడు . ఈ కథ మాదేనని ఒకవేళ కాపీ అని నిరూపించే అధరాలు ఉంటే రచయితల సంఘాన్ని ఆశ్రయించవచ్చని అప్పుడు వాళ్ళే అసలు విషయాన్ని తేలుస్తారని అంటున్నాడు . మరి వాసుదేవ్ వర్మ వస్తాడా అసలు కథ ఎవరిదో అనే విషయన్ని తేల్చుకుంటాడా చూడాలి.
చిరు 150 వ సినిమా కు బివిఎస్ రవి, దర్శకుడు పూరి కలిసి స్టొరీ తయారు చేసారు. ఐతే రెండు రోజులుగా చిరు సినిమా కథ ని రచయితలు ఒక NRI దగ్గర కంటెంట్ కొట్టేసి తయారు చేసారని మీడియా లో విపరీతం గ ప్రచారం జరుగుతుంది. దీనిపై నేడు పూరి జగన్నాధ్ వివరణ ఇచ్చారు. 150 వ సినిమాకు పూర్ర్తి కథ తమదే అని విషపూరిత ప్రచారాలను నమ్మవద్దు అని అన్నారు
ప్రస్తుతం శ్రీను వైట్ల చిత్రం లో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాకు సన్నాహాలు మొదలు పెట్టాడు. ప్రస్తుతం అయన శ్రీను వైట్ల దర్శకత్వం లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ జోరుగా జరుగుతుంది. ఈ సినిమాతో పాటు తన మరో సినిమాను కూడా త్వరలోనే ప్రరంబించాలనే ఆలోచనలో పడ్డాడు. ఇటివలే అల్లు అర్జున్ కు రేసుగుర్రం వంటి కెరీర్ బెస్ట్ సినిమాను ఇచ్చిన సురేందర్ రెడ్డి దర్శకత్వం లో ఈ సినిమా ఉంటుంది. ఇప్పటికే కథ చర్చలు కుడా జరిగాయని. ఎ కథను కోన వెంకట్ , గోపి మోహన్ లు రెడీ చేసారని సమాచారం. ప్రస్తుతం రవితేజ తో కిక్ 2 చిత్రాన్ని రూపొందిస్తున్న సూరి ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమా విడుదలా కాగానే చరణ్ సినిమా ప్రారంబం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించే 150 వ సినిమాకు ముహూర్తం కుదిరిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాధ్ దర్శకత్వం లో అయన నటించే ఈ సినిమాకు ఇప్పుడు చర్చలు కుడా జరుగుతున్నయట ! ప్రస్తుతం పూరి జగన్నాధ్ రూపొందిస్తున్న జ్యోతి లక్ష్మి సినిమా కుడా పూర్తీ కావడం తో ఇప్పుడు పూరి తన నెక్స్ట్ సినిమాకోసం బిజీగా మారనున్నాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి ఆటో జాని అనే టైటిల్ పెడుతున్నట్టు పుకార్లు మొదలయ్యాయి. అంతే కాదు ఈ సినిమాకు రజని కాంత్ బాషా చిత్రం లా ఉంటుందని కుడా వార్తలు వస్తున్నాయ్. అయితే అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాకు ఇంకా ఎ టైటిల్ ను కన్ఫర్మ్ చేయలేదు. అంతే కాదు ఈ సినిమాకు బడ్జెట్ కుడా బారిగా ఉంటుందని దీనికోసం 50 నుండి 60 కోట్లు అవుతుందని సమాచారం. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా కాబట్టి ఈ సినిమాకు వందకోట్ల మార్కెట్ ను టార్గెట్ చేసారు. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
నిన్నటితో రూమర్స్ అన్నిటికి చెక్ పడిపోయింది. చిరంజీవి తన 150 వ సినిమా కి పూరి జగన్నాధ్ కు దర్సకత్వ బాద్యతలు అప్పగించారు. బి వి ఎస్ రవి కథ తో ఈ సినిమా చేస్తునారు వారు. చరణ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా కు బండ్ల గణేష్ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించే అవకాసం ఉంది. ఇప్పుడు ఈ చిత్ర బృందం సినిమా టైటిల్ వేటలో పడింది. "ఆటో జానీ" పేరు గట్టిగ వినిపిస్తున్న అది అని ఇంకా ఫిక్స్ చేయలేదట.
నిన్నటితో రూమర్స్ అన్నిటికి చెక్ పడిపోయింది. చిరంజీవి తన 150 వ సినిమా కి పూరి జగన్నాధ్ కు దర్సకత్వ బాద్యతలు అప్పగించారు. బి వి ఎస్ రవి కథ తో ఈ సినిమా చేస్తునారు వారు. చరణ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా కు బండ్ల గణేష్ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ చిత్ర బృందం హీరోయిన్ వేటలో పడింది . నయనతార, అనుష్క పేర్లు ప్రముఖం గా చర్చిస్తునట్టు సమాచారం.
గబ్బర్ సింగ్ 2 గత రెండేళ్లుగా ఇదిగో అదిగో అంటూ మెగా ఫాన్స్ ను ఊరిస్తూ వస్తున్న సినిమా. ఏడాది క్రిదంటే కొబ్బరికాయ కొట్టుకున్న ఈ సినిమా ఇప్పటివరకు షూటింగ్ జరుపుకోలేదు. ఈ నెల 4 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది అని ముందు ప్రకటించిన అది కూడా వాయిదా పడింది. ఇప్పుడు మల్లి కొత్తగా మరో డేట్ ని ప్రకటించారు.
ఈ నెల 29 నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసుకుంటుంది అంట. పవర్ మూవీ ఫేం బాబీ దర్సకత్వం వహిస్తున ఈ మూవీ కి పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నార్త్ స్టార్ పతాకం పై నిర్మిస్తున్నారు.
ఇలా చిరు 150 వ సినిమా గురించి పూరి జగన్నాథ్ ప్రకటించారో లేదో అప్పుడే ఈ సినిమా నేషనల్ వైడ్ హడావిడి చేసేస్తుంది. ట్విట్టర్ వంటి సామజిక మాధ్యమాల్లో ఇండియా వైడ్ గ ట్రెండ్ సృష్టించింది అంటే చిరు రే ఎంట్రీ పై ఎంత చర్చ జరుగుతుందో తెలుస్తూనే ఉంది.
చిరు 150 వ సినిమాకి సర్వం సిద్దం అయిపోవడం తో అయన అభిమానుల తో పాటు సెలేబ్రటి లు కూడా తమ ఆనందాన్ని పంచుకున్ట్టునారు. ఇప్పటికే ఛార్మి, బండ్ల గణేష్, బి ఏ రాజు వంటి వారు ట్విట్టర్ ద్వార తమ ఆనందాన్ని వ్యక్తం చేయగా. ఇప్పుడు వరుణ్ తేజ్ ట్విట్టర్ లో డైలాగ్ లు పెల్చుతున్నాడు. "ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటి నుండి ఒక లెక్క" అంటూ ట్విట్టర్ లో తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు