అభిమానులు చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న సమయంలో 150వ సినిమాకి గ్రీన్ సిగ్నల్ రాగానే అభిమానుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి . ఆ సంతోషంలో ఉండగానే ఓ రచ్చ మొదలయ్యింది .
చిరంజీవి 150వ సినిమా కథ కాపీ అని యుఎస్ కి చెందిన వాసుదేవ్ వర్మ అనే రైటర్ అంటున్నాడు . ఎందుకంటే ఆ కథ నాదేనని దాన్ని బివిఎస్ రవి కాపీ కొట్టాడని ఆరోపిస్తున్నాడు . దాంతో మరో రచయిత గోపి మోహన్ స్పందించాడు . ఈ కథ మాదేనని ఒకవేళ కాపీ అని నిరూపించే అధరాలు ఉంటే రచయితల సంఘాన్ని ఆశ్రయించవచ్చని అప్పుడు వాళ్ళే అసలు విషయాన్ని తేలుస్తారని అంటున్నాడు . మరి వాసుదేవ్ వర్మ వస్తాడా అసలు కథ ఎవరిదో అనే విషయన్ని తేల్చుకుంటాడా చూడాలి.
No comments:
Post a Comment