చిరంజీవి - శ్రీదేవి కలిసి నటించిన "జగదేక వీరుడు అతిలోక సుందరి" సినిమా టాలీవుడ్ గర్వించదగ్గ సినిమాలలో ఒకటి. సోషియో ఫాంటసీ నేపద్యం లో తెరకెక్కిన ఈ సినిమా అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసింది. సాంకేతికంగా కూడా ఈ సినిమా తెలుగు సినిమాను మరో మెట్టు ఎక్కించింది. కే రాగవేంద్ర రావు తెరకెక్కించిన ఈ సినిమాను సి. అశ్వని దత్ బారి బడ్జెట్ తో నిర్మించారు. కొద్ది రోజుల క్రిందట ఈ సినిమా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బం గ ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తామని అశ్వని దత్ ప్రకటించారు. ఐతే ఇప్పుడు ఈ మూవీ ని 3D లో రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారట. చిరు 150 వ సినిమాతో పాటు ఈ సినిమా రీ రిలీజ్ కావడం మెగా ఫాన్స్ కు పండగే
No comments:
Post a Comment