Wednesday, 13 May 2015

చిరు సినిమాపై రకరకాల పుకార్లు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించే 150 వ సినిమాకు ముహూర్తం కుదిరిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాధ్ దర్శకత్వం లో అయన నటించే ఈ సినిమాకు ఇప్పుడు చర్చలు కుడా జరుగుతున్నయట ! ప్రస్తుతం పూరి జగన్నాధ్ రూపొందిస్తున్న జ్యోతి లక్ష్మి సినిమా కుడా పూర్తీ కావడం తో ఇప్పుడు పూరి తన నెక్స్ట్ సినిమాకోసం బిజీగా మారనున్నాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి ఆటో జాని అనే టైటిల్ పెడుతున్నట్టు పుకార్లు మొదలయ్యాయి. అంతే కాదు ఈ సినిమాకు రజని కాంత్  బాషా చిత్రం లా ఉంటుందని కుడా వార్తలు వస్తున్నాయ్. అయితే అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాకు ఇంకా ఎ టైటిల్ ను కన్ఫర్మ్ చేయలేదు. అంతే కాదు ఈ సినిమాకు బడ్జెట్ కుడా బారిగా ఉంటుందని దీనికోసం 50 నుండి 60 కోట్లు అవుతుందని సమాచారం. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా కాబట్టి ఈ సినిమాకు వందకోట్ల మార్కెట్ ను టార్గెట్ చేసారు. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.  

No comments:

Post a Comment