Tuesday, 19 May 2015

లారెన్స్ దర్సకత్వం లో మెగాస్టార్

మెగాస్టార్‌ చిరంజీవి రీ`ఎంట్రీ ఖరారైపోయింది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో 150వ సినిమా చేస్తున్న చిరంజీవి, ఈ సినిమా కోసం చాలా కసరత్తులే చేయాల్సి వస్తోంది. ఆగస్ట్‌లో సినిమా షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభమవుతుందని ఇటీవలే చిరంజీవి ప్రకటించేశారు కూడా.

సినిమా చిరంజీవికి కొత్త కాదు. కానీ, రాజకీయాల్లోకి వెళ్ళాక చిరంజీవి కాస్త లావెక్కారు. బాడీలో ఫ్లెక్సిబులిటీ తగ్గిపోయే వుంటుంది. సినిమాల్లో చిరంజీవి మెగాస్టార్‌.. డాన్సింగ్‌ సెన్సేషన్‌. అలాంటి చిరంజీవి, సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లో నటిస్తున్నారంటే, ఆయన్నుంచి బీభత్సమైన డాన్సుల్ని అభిమానులు ఆశించకుండా వుంటారా.? అందుకే మొదటగా సన్నబడేందుకు ప్రాధాన్యతనిచ్చిన చిరంజీవి, డాన్సులకూ అధిక ప్రాధాన్యతనిస్తున్నారట.

అన్నట్టు, చిరంజీవికి ఈ జనరేషన్‌ కొరియోగ్రాఫర్లలో బాగా ఇష్టమైనది లారెన్స్‌, ప్రభుదేవా. ప్రస్తుతం ఈ ఇద్దరూ అందుబాటులో వుండటంలేదు. ప్రభుదేవా బాలీవుడ్‌కి వెళ్ళిపోగా, లారెన్స్‌ మాత్రం తమిళ, తెలుగు సినిమాలతో కాలక్షేపం చేస్తున్నాడు.. అదీ దర్శకుడిగా, నటుడిగా. వేరే సినిమాలకు లారెన్స్‌ కొరియోగ్రఫీ చేయడం దాదాపు మర్చిపోయాడు. అయినాసరే, చిరు పిలుపుతో లారెన్స్‌, చిరంజీవి 150వ సినిమాకి కొరియోగ్రఫీ అందించడానికి ఓకే చెప్పాడట.

ఇప్పటికే చిరంజీవి క్లోజ్డ్‌ డోర్స్‌లో డాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తోంటే, లారెన్స్‌ కూడా కొన్ని సలహాలిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే, చిరంజీవిని మునుపటిలా.. డాన్సింగ్‌ స్టార్‌లా 150వ సినిమాతో చూసే అవకాశం అభిమానులకు దక్కుతుందన్నమాట. కొసమెరుపేంటంటే చిరంజీవి ఓకే చెబితే ఆయనతో సినిమా చేయడానికి లారెన్స్‌ కూడా రెడీగా వున్నాడట.



No comments:

Post a Comment