Tuesday, 19 May 2015

లారెన్స్ దర్సకత్వం లో మెగాస్టార్

మెగాస్టార్‌ చిరంజీవి రీ`ఎంట్రీ ఖరారైపోయింది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో 150వ సినిమా చేస్తున్న చిరంజీవి, ఈ సినిమా కోసం చాలా కసరత్తులే చేయాల్సి వస్తోంది. ఆగస్ట్‌లో సినిమా షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభమవుతుందని ఇటీవలే చిరంజీవి ప్రకటించేశారు కూడా.

సినిమా చిరంజీవికి కొత్త కాదు. కానీ, రాజకీయాల్లోకి వెళ్ళాక చిరంజీవి కాస్త లావెక్కారు. బాడీలో ఫ్లెక్సిబులిటీ తగ్గిపోయే వుంటుంది. సినిమాల్లో చిరంజీవి మెగాస్టార్‌.. డాన్సింగ్‌ సెన్సేషన్‌. అలాంటి చిరంజీవి, సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లో నటిస్తున్నారంటే, ఆయన్నుంచి బీభత్సమైన డాన్సుల్ని అభిమానులు ఆశించకుండా వుంటారా.? అందుకే మొదటగా సన్నబడేందుకు ప్రాధాన్యతనిచ్చిన చిరంజీవి, డాన్సులకూ అధిక ప్రాధాన్యతనిస్తున్నారట.

అన్నట్టు, చిరంజీవికి ఈ జనరేషన్‌ కొరియోగ్రాఫర్లలో బాగా ఇష్టమైనది లారెన్స్‌, ప్రభుదేవా. ప్రస్తుతం ఈ ఇద్దరూ అందుబాటులో వుండటంలేదు. ప్రభుదేవా బాలీవుడ్‌కి వెళ్ళిపోగా, లారెన్స్‌ మాత్రం తమిళ, తెలుగు సినిమాలతో కాలక్షేపం చేస్తున్నాడు.. అదీ దర్శకుడిగా, నటుడిగా. వేరే సినిమాలకు లారెన్స్‌ కొరియోగ్రఫీ చేయడం దాదాపు మర్చిపోయాడు. అయినాసరే, చిరు పిలుపుతో లారెన్స్‌, చిరంజీవి 150వ సినిమాకి కొరియోగ్రఫీ అందించడానికి ఓకే చెప్పాడట.

ఇప్పటికే చిరంజీవి క్లోజ్డ్‌ డోర్స్‌లో డాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తోంటే, లారెన్స్‌ కూడా కొన్ని సలహాలిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే, చిరంజీవిని మునుపటిలా.. డాన్సింగ్‌ స్టార్‌లా 150వ సినిమాతో చూసే అవకాశం అభిమానులకు దక్కుతుందన్నమాట. కొసమెరుపేంటంటే చిరంజీవి ఓకే చెబితే ఆయనతో సినిమా చేయడానికి లారెన్స్‌ కూడా రెడీగా వున్నాడట.



Saturday, 16 May 2015

Chiru 150 1st Look

Chiru 150 Movie Fan Made Poster :)

Thursday, 14 May 2015

3D లో చిరు సినిమా

చిరంజీవి - శ్రీదేవి కలిసి నటించిన "జగదేక వీరుడు అతిలోక సుందరి"  సినిమా టాలీవుడ్ గర్వించదగ్గ సినిమాలలో ఒకటి. సోషియో ఫాంటసీ నేపద్యం లో తెరకెక్కిన ఈ సినిమా అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసింది. సాంకేతికంగా కూడా ఈ సినిమా తెలుగు సినిమాను మరో మెట్టు ఎక్కించింది. కే రాగవేంద్ర రావు తెరకెక్కించిన ఈ సినిమాను సి. అశ్వని దత్ బారి బడ్జెట్ తో నిర్మించారు. కొద్ది రోజుల క్రిందట ఈ సినిమా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బం గ ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తామని అశ్వని దత్ ప్రకటించారు. ఐతే ఇప్పుడు ఈ మూవీ ని 3D లో రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారట. చిరు 150 వ సినిమాతో పాటు ఈ సినిమా రీ రిలీజ్ కావడం మెగా ఫాన్స్ కు పండగే 

చిరంజీవి సినిమా కాపీ అంటూ రచ్చ

అభిమానులు చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న సమయంలో 150వ సినిమాకి గ్రీన్ సిగ్నల్ రాగానే అభిమానుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి . ఆ సంతోషంలో ఉండగానే ఓ రచ్చ మొదలయ్యింది . చిరంజీవి 150వ సినిమా కథ కాపీ అని యుఎస్ కి చెందిన వాసుదేవ్ వర్మ అనే రైటర్ అంటున్నాడు . ఎందుకంటే ఆ కథ నాదేనని దాన్ని బివిఎస్ రవి కాపీ కొట్టాడని ఆరోపిస్తున్నాడు . దాంతో మరో రచయిత గోపి మోహన్ స్పందించాడు . ఈ కథ మాదేనని ఒకవేళ కాపీ అని నిరూపించే అధరాలు ఉంటే రచయితల సంఘాన్ని ఆశ్రయించవచ్చని అప్పుడు వాళ్ళే అసలు విషయాన్ని తేలుస్తారని అంటున్నాడు . మరి వాసుదేవ్ వర్మ వస్తాడా అసలు కథ ఎవరిదో అనే విషయన్ని తేల్చుకుంటాడా చూడాలి.

Wednesday, 13 May 2015

కొత్త లుక్ లో అదుర్స్ అనిపించిన రామ్ చరణ్

ఆటో జాని పై రుమర్లను నమ్మవద్దు - పూరి

\
చిరు 150 వ సినిమా కు బివిఎస్ రవి, దర్శకుడు పూరి కలిసి స్టొరీ తయారు చేసారు. ఐతే రెండు రోజులుగా చిరు సినిమా కథ ని రచయితలు ఒక NRI దగ్గర కంటెంట్ కొట్టేసి తయారు చేసారని మీడియా లో విపరీతం గ ప్రచారం జరుగుతుంది. దీనిపై నేడు పూరి జగన్నాధ్ వివరణ ఇచ్చారు. 150 వ సినిమాకు పూర్ర్తి కథ తమదే అని విషపూరిత ప్రచారాలను నమ్మవద్దు అని అన్నారు