Friday, 8 May 2015

అవన్నీ అర్ధం పర్దం లేని వార్తలు - మెగా ఫాన్స్

కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలను ఆగస్ట్ 22 న మెగా ఫ్యాన్స్ ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.ఇటీవల గుంటూరు జిల్లా చినకాకాని లోనిహాయ్ ల్యాండ్ లో చిరంజీవి యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అమిరిశెట్టి వెంకటేశ్వర రావు ఆధ్వర్యం లో జరిగిన సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కు చెందిన చిరంజీవి అభిమాన సంఘాల ప్రముఖులు పాల్గొన్నారు. ఆగస్ట్ 2 నుంచి హైదరాబాద్ తో పాటు ప్రముఖ పట్టణాలన్నింటిలో చిరంజీవి వేడుకలు ఘనంగా ఆరంభించాలని వారు నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఈ సమావేశం తరువాత కొన్ని రకాల ప్రచారాలు ఊపందుకున్నాయి. చిరు బర్త్ డే వేడుకల కోసం మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చందాలు వసూలు చేయాలని కోరగా, అందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారని ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం లో ఎటువంటి నిజాలు లేవని, పవన్ ఎవరికి కూడా వార్నింగ్ ఇవ్వలేదని రాష్ట్ర రామ్ చరణ్ యువత ఓ ప్రకటన లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆధారాలు లేకుండా మీడియా మిత్రులు కూడా ప్రచారం చేయవద్దని వారు విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment