సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం తర్వాత కొంత గ్యాప్ దొరకడంతో వేసవి సెలవులను కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయడానికి బ్రిటన్ వెళుతున్నాడు అల్లు అర్జున్ . ఇటీవల రిలీజ్ అయిన సన్నాఫ్ సత్యమూర్తి కి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కేరళలో అలాగే తెలుగునాట కూడా మంచి వసూళ్ళ నే సాధించింది . ఇక బ్యాలెన్స్ గా ఉన్న రుద్రమదేవి డబ్బింగ్ వర్క్ ని కూడా పూర్తిచేసిన అల్లు అర్జున్ తన తనయుడు ,భార్య తో కలిసి బ్రిటన్ లో మూడు వారాల పాటు సేద తీరుతాడట . బ్రిటన్ నుండి తిరిగి వచ్చాక బోయపాటి దర్శకత్వంలో నటించబోయే సినిమాకు రెడీ కానున్నాడు.
No comments:
Post a Comment