Sunday, 10 May 2015

చరణ్ విమానాల కంపెనీ లోగో ఇదేనా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విమానయాన రంగం లోకి ఎంట్రి ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు చకా చకా జరుగుతున్నాయి. వచ్చే నెలలో ఈ విమానాలు గగన తలం లో ఎగరనున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉండే ఈ విమానాల కోసం ఓ లోగోను రెడీ చేసారు. ట్రు జెట్ పేరుతొ ఎగిరే ఈ విమానాలు మెగా టర్బో కంపెనీ గా నడుస్తాయి. మరి ఆ లోగో పై మీరు ఓ లుక్ వేయండి. అన్నట్టు రామ్ చరణ్ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ లో ఉన్నాడు. మై నేమ్ ఇస్ రాజు అనే పేరుతొ రూపొందే ఈ చిత్రం లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.

No comments:

Post a Comment