అటు ఆంధ్రప్రదేశ్ లోను, ఇటు తెలంగాణలోను ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతున్నది. రేపు డిసెంబర్ నెలలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన పార్టీ పోటీ చేస్తుందా..? పోటీ చేస్తే.. ఎన్ని వార్డులలో పోటీ చేస్తుంది.. ఎంత మంది అభ్యర్ధులు గెలుస్తారు. బీజేపి, తెలుగుదేశం పార్టీతో కలసి పోటీ చేస్తుందా లేక ఒంటరిగానే బరిలోకి దిగుతుందా..? దీనిగురించే అంతా చర్చించుకుంటున్నారు. జనసేన పార్టీ రాజకీయ పార్టీగా అవతరించిన తరువాత మొదటగా హైదరబాద్ నుంచి పోటీచేయాలని భావించిన సంగతి తెలిసిందే. ఇక, ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సనత్ నగర్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జోరుగా జరుగుతున్నది. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి, ఆ తరువాత టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి అయిన తలసానిపై పోటీ చేస్తాడని, పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేసేందుకు ఓకే అంటే కనుక తెలంగాణ తెలుగుదేశం పార్టీ, బీజేపి లు మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. మరి సనత్ నగర్ నియోజక వర్గానికి ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారో ఇంకా స్పష్టం కాలేదు. అటు పవన్ కళ్యాణ్ కూడా అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పడం లేదు. కాని, మీడియా లో మాత్రం వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. ఈ ఊహాగానాలకు తెరపడాలి అంటే పవన్ పెదవి విప్పాలి. ఆయన మనసులో ఏమున్నదో బయటపెట్టాలి. అప్పటివరకు ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి.
No comments:
Post a Comment