Saturday, 9 May 2015

48 కోట్లు కలెక్ట్ చేసిన సన్ ఆఫ్ సత్యమూర్తి


త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి చిత్రానికి మొదట డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఓవరాల్ గా చూస్తే మంచి వసూళ్ళ నే సాధించింది అల్లు అర్జున్ చిత్రం . సినిమా రిలీజ్ కు ముందు ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన సన్నాఫ్ సత్యమూర్తి ఆ అంచనాలను మాత్రం చేరుకోలేకపోయింది . అయితే బాక్సాఫీస్ వద్ద మరో సినిమా లేకపోవడంతో ఇప్పటి వరకు 48కోట్లను వసూల్ చేసినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు . ఈ వసూళ్ళ తో అల్లు అర్జున్ కు బాక్సాఫీస్ వద్ద ఉన్న సత్తా ఏంటో మరోసారి నిరూపించింది . ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ లతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఈ కలెక్షన్లను సాధించింది సన్నాఫ్ సత్యమూర్తి . 

No comments:

Post a Comment