టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్ చేసి, తనను అభిమానించే అభిమానులనే తన సైన్యంగా మార్చుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ ఒక హీరోగానే కాకుండా ఒక మానవతావాదిగా, రాజకీయ నాయకుడిగా ప్రజల్లో ఎంతో ప్రాచుర్యాన్ని పొందాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ 2′ సినిమా కోసం సిద్దమవుతున్నాడు. ఈ సినిమా ఈ నెలాఖరున సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది కాకుండా దాసరి నారాయణరావు నిర్మాతగా పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయనున్నాడు. అసలు అనుకోని విధంగా ఈ క్రేజీ కాంబినేషన్ ఎలా సెట్ అయ్యిందా అని అందరూ అనుకుంటున్నారు.
దీని వెనకున్న అసలైన కారణాన్ని దాసరి తెలియజేశాడు. ఈ కాంబినేషన్ గురించి మాట్లాడుతూ ‘ ఈ సినిమా అనుకోవడానికి గల కారణం పవన్ కళ్యాణ్ గొప్పతనం మాత్రమే. నెంబర్ 1 స్థానంలో ఉన్న స్టార్ హీరో అతను, కానీ తానంతట తనే వచ్చి మన ఇద్దరం కలిసి సినిమా చెయ్యాలి అన్నాడు. నేను మొదట్లో ఏదో మాట వరసకి అలా చెప్పాడులే అనుకున్నా కానీ సినిమా విషయంలో తను సీరియస్ గా ఉన్నాడు. పెద్దవాళ్ళకి గౌరవం ఇచ్చేవాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా, అతని వ్యక్తిత్వం నన్ను ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం తన సినిమా కోసం కథలు వింటున్నాను. నేను డైరెక్ట్ చెయ్యను. ఇప్పటి ప్రేక్షకులకి నేను ఇచ్చేది కాకుండా వేరే ఏదో కావాలి అందుకే నేను నిర్మాతగా మాత్రమే ఉంటానని’ దాసరి అన్నాడు.
దాసరి నారాయణరావు ఇప్పటి వరకూ 150 చిత్రాలకు దర్శకత్వం వహించి ఎన్నో సినిమాలతో తిరుగులేని రికార్డ్స్ ని సృష్టించాడు.

super talk dasari garu about pawan sir
ReplyDelete