Monday, 4 May 2015

మోడీపై చిందులు తొక్కిన ‘చిరు’!

కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి శనివారం ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీవన్నీ కల్లబొల్లి కబుర్లేనని, విదేశీ పర్యటనలంటే జోరు చూపించే మోడీకి దేశ సమస్యలపై అవగాహాన లేదని మండిపడ్డారు. అలాగే భూసేకరణ బిల్లు పేరిట పేద రైతులను దగా చేసేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధమవుతోందని చిరు నిప్పులు చెరిగారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ తీరని అన్యాయం చేస్తున్నారని, హుదుద్ తుఫాను సహాయార్ధం వెయ్యి కోట్లు ఇస్తానని మాటిచ్చి 600కోట్లే విడుదల చేశారని, అదేవిధంగా ఏపీకి ఢిల్లీని తలదన్నే రాజధానిని ఏర్పాటు చేస్తానని చెప్పి ఇప్పుడు ఆ ప్రస్తావనే తేవడం లేదని మండిపడ్డారు. అలాగే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అంటూ వంద కోట్లు చేతిలో పెట్టడం చూస్తేనే మోడీ మాటల ప్రధాని అని నిరూపించబడుతోందని, మాటలతో ప్రచారం చేసుకునే ఆరాటమే తప్ప మోడీ భారత్ కు చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు.

No comments:

Post a Comment