జనసేన అధ్యక్షుడు, సిని నటుడు పవన్ కళ్యాణ్ తలచుకుంటే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వస్తుందని సినీనటుడు, బీజేపి నేత శివాజీ అన్నారు. ఈరోజు ఆయన గుంటూరులో ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్షను ప్రారంభించారు. ప్రత్యేక హోదా ఆంద్ర హక్కు అనే నినాదంతో ఆయన దీక్షను చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలనీ ఆయన అన్నారు. ప్రత్యేక హోదా అవసరమైతే తన ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పాడు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిందని, తరువాత అధికారంలోకి వచ్చిన బీజేపి పార్టీ దాన్ని పక్కన పెట్టిందని శివాజీ అన్నారు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక శక్తి అని, ఆయన ప్రధాని, ఇతర కేంద్ర మంత్రులతో మాట్లాడితే పని అవుతుందని పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.

No comments:
Post a Comment