‘గోవిందుడు అందరివాడేలే’ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేయనున్న సినిమా ‘మై నేమ్ ఈజ్ రాజు'(వర్కింగ్ టైటిల్). ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం ఈ చిత్ర టీం ఏప్రిల్ 22 నుంచి మొదలు కానున్న షెడ్యూల్ కోసం సిద్దమవుతున్నారు. ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం తమన్ ఈ సినిమాకి సంబందించిన సాంగ్స్ అన్నీ ఫినిష్ చేసేసాడు. ఏప్రిల్ 22 నుంచి మొదలయ్యే షెడ్యూల్ పూర్తి కాగానే సాంగ్స్ షూటింగ్ కోసం యూరప్ వెళ్లనున్నారు. దాంతో తమన్ సాంగ్స్ అన్నీ ఫినిష్ చేసి ఇచ్చేసాడు.
‘ఆగడు’తో ఫ్లాప్ అందుకున్న శ్రీను వైట్ల ఈ సినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. అలాగే చాలా రోజుల తర్వాత శ్రీను వైట్ల కోన వెంకట్ – గోపి మోహన్ లతో కలిసి పని చేస్తున్నాడు. అన్ని అంశాలు కలగలిపిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో రామ్ చరణ్ చెల్లెలిగా కృతి కర్భంద కనిపించనుంది. డివివి దానయ్య నిర్మించనున్న ఈ సినిమాని రెగ్యులర్ షూటింగ్ లో ఫినిష్ చేసి అక్టోబర్ 15న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

No comments:
Post a Comment