అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ మరో సారి బాక్స్ ఆఫీస్ దగ్గర విజయవంతమయ్యింది. గత వారం ప్రేక్షేకుల ముందుకు వచ్చిన సన్ అఫ్ సత్యమూర్తి చిత్రం సూపర్ హిట్ తో దూసుకపోతుంది. తాజాగా అల్లు అర్జున్ , పవన్ కళ్యాణ్ రికార్డ్స్ ని బ్రేక్ చేసాడని సమాచారం.
యూఎస్ఏలో ఈ చిత్రం ఇప్పటికే 1 మిలియన్ డాలర్ మార్కను దాటేసి , అత్తారింటికి దారేది రికార్డ్స్ కొల్లగొట్టే విధంగా కలెక్షన్స్ రాబడుతుంది. ఓవర్సేస్ లో 1 మిలియన్ మార్కు దాటిన అల్లు అర్జున్ రెండో చిత్రం ఇది. బన్నీ గత చిత్రం జులాయి కూడా ఇక్కడ 1 మిలియన్ మార్కును క్రాస్ అయింది.
అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్,స్నేహ ముఖ్య పాత్రలలో నటించారు. మరోసారి త్రివిక్రమ్ తనదైన స్టైల్ లో ఫ్యామిలీ ఆడియన్సును ఆకర్షించడంలో సక్సెస్ అయ్యాడు.

No comments:
Post a Comment