Thursday, 23 April 2015

అల్లు అర్జున్ ‘నో’ వెనకున్న కారణం ఇదేనా.!


ఎనర్జిటిక్ డాన్సులు, యాక్టింగ్ మరియు డిఫరెంట్ డైలాగ్ దేలివరీతో ఇటు తెలుగులోనే కాక, అటు మలయాళంలో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇన్ని రోజులు సౌత్ సినిమాలకే పరిమితం అయిన అల్లు అర్జున్ కి బాలీవుడ్ ఆఫర్ వచ్చిందని, డాన్స్ ప్రధాన ఇతివృత్తంగా తెరేకేక్కిన ‘ఎబిసిడి 2’లో బన్ని ఓ ముఖ్య పాత్రలో కనిపించానున్నడనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అల్లు అర్జున్ అందులో కనిపించడం లేదు. బన్ని తన దగ్గరికి వచ్చిన వకాశాన్ని సింపుల్ గా నో చెప్పాడు.
బాలీవుడ్ లో ఆఫర్ వస్తే నో చెప్పాడా అసలు నో వెనకున్న కారణం ఏంటంటే.. ‘నేను బాలీవుడ్ సినిమాలు చేయడానికి వ్య్తిరేఖిని కడు.. హిందీ సినిమలు చేయడం నాకు ఓకే.. కానీ వచ్చిందని అలా చెయ్యను. నాకు రైట్ స్టొరీ ఇది అని పిస్తే చేస్తాను. ఎబిసిడి 2 లో నాకు పర్ఫెక్ట్ గా అనిపించలేదు అందుకే చేయలేదు. ముఖ్యంగా అతిధి పాత్రలు చేయాలని అస్సలు అనుకోవడం లేదని’ అల్లు అర్జున్ తెలిపాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘S/O సత్యమూర్తి’ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యింది. అల్లు అర్జున్ ప్రస్తుతం బోయపాటి సినిమా కోసం సిద్దమవుతున్నాడు.

No comments:

Post a Comment