Thursday, 23 April 2015

కోబలి’ కోసమే పవన్ గడ్డం పెంచుతున్నాడా ??



పవన్ కళ్యాణ్.. ఎప్పుడు సాదాసీదా గా కనిపిస్తూ సింపుల్ సిటీ కి ఇష్టపడే వ్యక్తి. తాజాగా పవన్ తన లుక్ ని మార్చుకొని అందర్ని ఆశ్చర్యపరిచాడు. తీవ్ర అనారోగ్యం తో బాధపడి పవన్ కళ్యాణ్ చేతి స్పర్శ తో , తిరిగి కోలుకున్న శ్రీజ తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ ను సోమవారం ఆయన కార్యాలయం లో కలిసిన సంగతి తెలిసిందే.
ఇటీవల రాజకీయాల్లో బిజీ గా ఉన్న పవన్, తన అభిమానుల కోరిక మేరకు తిరిగి చిత్రాల్లో నటించాలని నిర్ణయించుకున్నారు. గబ్బర్ సింగ్ సీక్వెల్ ను మే మొదటివారం లో సెట్స్ ఫైకి రానుంది. కానీ నిన్న పవన్ లుక్ చూసిన అబిమానులు, సినీ జనాలు మాత్రం గతంలో ఆగిపోయిన కోబలి చిత్రాన్ని పూర్తి చేయటం కోసమే పవన్ ఇలా గడ్డం పెంచుకున్నాడు అని అనుకుంటున్నారు.
కోబలి చిత్రం పూర్తి ప్రాచీన రాయలసీమ ప్రాంత నేపద్యంలో సాగుతుందని, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఇటీవల స్టేట్ మెంట్ ఇవ్వడం తో పవన్ కళ్యాణ్ లుక్ కూడా అదే తరహాలో ఉండడం తో అందరు అదే అని నమ్ముతున్నారు. ఏది ఏమయినా పవన్ కళ్యాణ్ కొత్త లుక్ అందర్ని ఆశ్చర్యపరచడం కాకుండా కొత్త అనుమానాలకు దారి తీసుతుంది

No comments:

Post a Comment