గతవారం రోజులగా మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాను బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడనే పుకార్లు రాజ్యమేలాయి. అయితే వీటన్నిటికీ బండ్ల గణేష్ సమాధానమిచ్చాడు.
తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో తాను చిరంజీవితో కలిసి ఎటువంటి చిత్రం తీయడంలేదని ఏదైనా వుంటే తప్పకుండా తెలియపరుస్తానని చెప్పుకొచ్చాడు. మెగా ఫ్యామిలీతో వున్న సాన్నిహిత్యం వలనే ఇలాంటి రూమర్లు వస్తున్నట్టు భావించాడు. టెంపర్ విజయంతో బండ్లన్న ఆనందంలో వున్న సంగతి తెలిసినదే.

No comments:
Post a Comment