విలక్షణ దర్శకుడు మురుగదాస్, తమిళ సూపర్ స్టార్ విజయ్ కాంబినేషన్‌లో తమిళంలో విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం.. ‘కత్తి’. రైతుల కోసం పోరాడే పవర్‍ఫుల్ పాత్రలో విజయ్ అలరించారు. ఈ సినిమా తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. గత సంవత్సరం అక్టోబర్ నెలలో విడుదలైన ఈ చిత్రం తెలుగులో ఇప్పుడు విడుదలవుతుందని, అప్పుడు విడుదల అవుతుందని అనడమే కానీ ఇంతవరకూ ముందుకు కదల్లేదు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు కత్తిని తెలుగులో రీమేక్ చేసేందుకు స్టార్ హీరోలు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
తెలుగులో చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోల్లో ఎవరో ఒకరితో రీమేక్ చేస్తే.. మరింత ప్రయోజనం ఉంటుందని డబ్బింగ్ వర్క్ జరగనివ్వలేదు. తాజాగా ఈ రీమేక్‌కి సంబంధించిన ఆసక్తికర విషయం తెలిసింది. ఈ సినిమాను తెలుగులో ఎన్టీఆర్ లేదా పవన్ కళ్యాణ్ రీమేక్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఎవరి చేతుల్లోకి ఈ సినిమా వెళ్ళనుందనేది తెలిసే అవకాశం ఉంది.

No comments:
Post a Comment