Thursday, 23 April 2015

రామ్ చరణ్ యాక్షన్ కి డేట్ ఫిక్స్ అయ్యింది.!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మాస్ కి కామెడీని జోడించి చెప్పే డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో రానున్న మూవీ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం సెకండ్స్ షెడ్యూల్ ని హైదరాబాద్ లో మొదలు పెట్టారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ స్టంట్ మాస్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అందుకోసమే రామ్ చరణ్ స్పెషల్ గా బ్యాంకాక్ వెళ్లి అక్కడ ఫేమస్ అయిన ది మార్షల్ ఆర్ట్స్ స్కూల్ లో జైక స్టంట్స్ పైన స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.
యాక్షన్ ఎపిసోడ్స్ లో కొత్తదనం చూపించడం కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా ఈ ట్రైనింగ్ తీసుకున్నాడు. ట్రైనింగ్ మొత్తం పూర్తి చేసుకున్న రామ్ చరణ్ సినిమా షూటింగ్ కోసం సిద్దమవుతున్నాడు. ప్రారంభమైన రెండవ షెడ్యూల్ లో నటీనటులపై కొన్ని సన్నీ వేషాలను షూట్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఈనెల 27 నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. రామ్ చరణ్ కి సిస్టర్ పాత్రలో కృతి కర్బంద నటించనుంది. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 15న రిలీజ్ కానుంది.

No comments:

Post a Comment