Thursday, 23 April 2015

కోక పేటలో సుబ్రమణ్యం

మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న మూడవ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. రెజీన కసాండ్ర రెండవ సారి సాయి ధరమ్ తేజ్ సరసన జోడీ కడుతున్న ఈ సినిమాలో ఆద శర్మ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. కమర్షియల్ అంశాలను జోడించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ప్రస్తుతం కోకాపేట్ లో వేసిన స్పెషల్ హౌస్ సెట్ లో షూటింగ్ జరుగుతోంది.
ప్రస్తుతం హరీష్ శకర్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నాడు. ఈ షూటింగ్లో సాయి ధరమ్ తేజ్, రెజీన, సుమన్, ప్రగతి, తేజస్వి, సురేఖ వాని తదితరులు పాల్గొంటున్నారు. పూర్తి కమర్షియల్ హంగులతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇండియాలోని పలు ప్రాంతాల్లో షూట్ చేయనున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ ని అమెరికాలో షూట్ చేయనున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

No comments:

Post a Comment