Thursday, 23 April 2015

చిరంజీవి 150వ సినిమాలో శ్రీదేవి హీరోయిన్ ??

చిరంజీవి 150వ సినిమాలో హీరోయిన్ గా అతిలోకసుందరి శ్రీదేవి ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది . అందుకు సంబందించిన చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే అది కొలిక్కి వస్తుందని అంటున్నారు . చిరంజీవి -శ్రీదేవి ల కాంబినేషన్ లో వచ్చిన ''జగదేకవీరుడు అతిలోకసుందరి '' రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే . ఎస్పీ పరశురాం యావరేజ్ కాగా చిరు -శ్రీదేవి జంట మాత్రం ఆకట్టుకుంది . దాంతో చిరంజీవి 150వ సినిమాలో శ్రీదేవి కనుక ఉంటే బాగుంటుందని భావిస్తున్నారట . చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ కొత్త చిత్రం ప్రారంభించాలని అనుకుంటున్నారు . ప్రస్తుతానికి దర్శకుడిగా వినిపిస్తున్న పేరు పూరి జగన్నాద్ . అయితే చిరు 150వ చిత్రానికి దర్శకత్వం వహించడానికి పూరి ఉత్సాహ పడుతున్నాడు కాబట్టి పూరి చేతిలోనే చిరు 150వ సినిమాని పెట్టారట . 

No comments:

Post a Comment