Thursday, 16 April 2015

24 న సన్ ఆఫ్ సత్యమూర్తి మలయాళ వెర్షన్ విడుదల

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సమంత – నిత్యా మీనన్ – ఆద శర్మ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘S/O సత్యమూర్తి’. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా సమ్మర్ సీజన్, బన్ని – త్రివిక్రమ్ కాంబినేషన్, సినిమాలు ఏమీ లేకపోవడం వలన బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ వరదలా వస్తున్నాయి. మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిందని నిన్ననే తెలియజేశాం. ఓవరాల్ గానే కాకుండా ఏరియాల పరంగా కూడా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ ని సాధిస్తోంది.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కి తెలుగులోలానే మలయాళంలో కూడా సూపర్బ్ క్రేజ్ ఉంది. తన ప్రతి సినిమా మలయాళంలో కూడా రిలీజ్ అవుతుంది. తాజాగా ఈ సినిమా మలయాళ వెర్షన్ రిలీజ్ డేట్ ని ఖరారు చేసారు. ఏప్రిల్ 24న ఈ సినిమాని మలయాళంలో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తెలుగులో లానే మలయమలో కూడా మంచి హిట్ అవుతుందని అక్కడి నిర్మాతలు భావిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో ఉపేంద్ర, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్ లు ముఖ్య పాత్రలు పోషించారు.

No comments:

Post a Comment