Tuesday, 24 March 2015

రేయ్ సెన్సార్ డీటెయిల్స్

సాయిధరమ్ తేజ్ మొదటి సినిమా రేయ్ విడుదలకు సిద్దం అయ్యింది. గత సంవత్సర కాలం గ విడుదలకు నోచుకోని ఈ సినిమాను ఈ నెల 27 వ తేది న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా  రిలీజ్  చేయునున్నట్టు ప్రకటించారు. వైవిస్ చౌదరి స్వీయ నిర్మాణం లో బొమ్మరిల్లు బ్యానర్ పై నిర్మించిన ఈ  సినిమాను ఎక్కువ శాతం వెస్టిండీస్, అమెరికా లలో చిత్రీకరించారు.శ్రద్దదాస్, సయామీ ఖేర్ లు హీరోయిన్స్ గ నటించారు  ‘రేయ్’కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు గత నెల 27నే ముగిశాయ్.168 నిమిషాల నిడివి గల ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేశారు. ఏ సర్టిఫికెట్ జారీ . పూర్తి స్థాయి లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో ఎక్కువగా యూత్‌కి కనెక్ట్ అయ్యే అంశాలను తెరకెక్కించారు . ఇక ప్రస్తుతానికి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా అనుకున్న తేదీనే విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన పాటలు అభిమానుల్లో జోరు పెంచగా, ఈమధ్యనే విడుదల చేసిన పవనిజం సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

No comments:

Post a Comment