స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘S/O సత్యమూర్తి’. ఈ సినిమా నేడు (ఏప్రిల్ 9న) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా విశేషాలను అల్లు అర్జున్ మీడియాతో పంచుకున్నారు. అందరూ చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఈ సినిమా అని, అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమంత, నిత్యామీనన్, అదా శర్మలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను ఎస్. రాధాకృష్ణ నిర్మించారు.
ఇక ఇదే సమావేశంలో ‘రుద్రమదేవి’ సినిమాలోని తన పాత్ర గురించి ముచ్చటించారు అల్లు అర్జున్. ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ లాంటి సినిమాలు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేవనీ, ఆ సినిమాల ద్వారా తెలుగు సినిమా మార్కెట్ పెరుగనుందని ఆయన తెలిపారు. అలాంటి ఒక సినిమాలో తానో పాత్ర చేయడం ద్వారా దానికి మరింత ఆకర్షణ తోడవుతుందనే ఆ సినిమాలో నటించానని స్పష్టం చేశారు. రుద్రమదేవిలో తాను చేసిన గోనగన్నారెడ్డి పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. బోయపాటి శ్రీనుతో ప్రస్తుతం ఓ సినిమాకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని అది కొలిక్కిరాగానే ప్రకటన విడుదల చేస్తానని బన్నీ తెలిపారు.

No comments:
Post a Comment