Thursday, 30 April 2015

పవర్ స్టార్ ను కలసిన పశ్చిమ బెంగాల్ వాసి


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం, అభిమానం. ఆ ఇష్టంతోనే ఎంతో కష్టమైనా సైకిల్ మీద  ప్రయాణం చేస్తూ దాదాపు నెలరోజుల అనంతరం ఈరోజు  తన అభిమాన నటుడిని కలిసాడు అద్దంకి రవి. పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్ పూర్ నివాసి. ఈ నెల (ఏప్రిల్) 3 న ఖరగ్ పూర్ నుంచి సైకిల్ మీద ప్రయాణం మొదలుపెట్టాడు.  దాదాపు 1500 కిమీ ప్రయాణం చేసి ఈరోజు (ఏప్రిల్ 30) సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జనసేన అధినేతను ఆయన కార్యాలయంలో కలిసాడు రవి. చాలా సంవత్స రాలనుంచి ఆయనను కలవాలన్న కోరిక ఈరోజు తో తీరిందని, తనకెంతో ఆనందంగా ఉందని మాటలో చెప్పలేనత భావోద్వేగానికి గురయ్యాడు. తనను కలసిన అభిమానిని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాదరంగా ఆదరించారు.

No comments:

Post a Comment