క్రేజీ దర్శకుడు మణిరత్నం తాజాగా రూపొందించిన ఓకే బంగారం మంచి టాక్ తెచ్చుకుంటుంది. మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ , నిత్యా మీనన్ జంటగా నటించిన ఈ సినిమా అటు తమిళం లోకూడా మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో హీరోగా నటించాల్సింది రామ్ చరణ్ , అప్పట్లో మణిరత్నం చిరంజీవి , చరణ్ తో చర్చలు కుడా జరిపాడు. ఈ సినిమా చరణ్ చేస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా చేయడానికి చరణ్ వెనకడుగు వేసాడు. దానికి కారణం ఆరంజ్ సినిమా తో చరణ్ దెబ్బ తిన్నాడు. మాస్ అంశాలు లేకుండా సినిమా చేస్తే ప్రేక్షకులకు నచ్చదని ఈ సినిమాను వద్దన్నాడట. రొమాంటిక్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా నిజంగా చరణ్ చేసి ఉంటె దాని ఫలితం మరోలా ఉండేదేమో

No comments:
Post a Comment