Saturday, 11 April 2015

సన్నాఫ్ సత్యమూర్తి కర్నాటక కలెక్షన్లు

సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో త్రివిక్రమ్, అల్లు అర్జున్ లు మరోసారి మనల్ని పలకరించారు. నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ రీతిలో విడుదలైన ఈ సినిమా రెండవ రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీగా నిలబడింది. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం రెండవ రోజు కూడా రికార్డు కలెక్షన్ లను సంపాదించింది
ఇప్పటివరకూ కేవలం కర్ణాటకలోనే 4.35కోట్లను సంపాదించుకున్న ఈ సినిమా అల్లు అర్జున్ స్టామినాని మరోసారి రుజువు చేసింది. కన్నడ నటుడు ఉపేంద్ర కూడా వుండడం అక్కడ ఈ సినిమాకు అదనపు బలంగా మారి మంచి కలెక్షన్లకు తోడ్పడింది
సమంతా, అదా శర్మ, నిత్యా మేనన్ హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాలో ఉపేంద్ర, స్నేహ ముఖ్యపాత్రధారులు. రాధా కృష్ణ నిర్మాత

No comments:

Post a Comment