Monday, 13 April 2015

నింగికెగరడానికి సిద్దమైన రామ్ చరణ్ టర్బో ఫ్లైట్స్



మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగానే కాకుండా ఇటీవలే ఎయిర్ లైన్స్ బిజినెస్ లో కూడా దిగనున్నట్లు తెలిపారు. రామ్ చరణ్ టర్బో మెగా ఎయిర్ వేస్ కలిసి సంయుక్తంగా చేయనున్న ఈ ఎయిర్ వేస్ కి ‘ట్రూ జెట్’ అనే పేరుని ఖరారు చేసారని ఇది వరకే తెలియజేశాం. మరో 10 రోజుల్లో ఈ మెగా టర్బో ఫ్లైట్స్ కి డైరెక్టోరేట్ జెనెరల్ అఫ్ సివిల్ అవిఏషణ్ నుంచి క్లియరెన్స్ లెటర్ రానుంది. అలాగే మరో 45 రోజుల్లో ఈ ఫ్లైట్ సర్వీస్ ని ప్రారంభించనున్నారు.
ఇప్పటికే ఈ ఎయిర్ వేస్ కి సంబంధించి పైలత్స్, కాబిన్ స్టాఫ్ మరియు మిగతా స్టాఫ్ ని కూడా సెలక్ట్ చేసారు. విజయవాడ కేంద్రంగా ఈ ఎయిర్ వేస్ ని నడపనున్నారు. మొదటగా రెండు ఎయిర్ క్రాఫ్ట్స్ మే చివరి నుంచి మొదలైతే, సెకండ్ బ్యాచ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆగష్టు నుంచి మొదలవుతాయి. అలాగే మొదటి సెషన్ లో హైదరాబాద్ ని బేస్ చేసుకొని ఈ ఎయిర్ లైన్ సర్వీస్ ని విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, బెంగుళూరు, ఔరంగాబాద్ లకి ట్రావెల్ ప్లాన్ చేసారు.

No comments:

Post a Comment