ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగుదేశం పార్టీ ఆహ్వానం పంపింది. కాగా మే నెల 27 నుండి 29 వరకు విజయవాడలో జరిగే తెలుగుదేశం మహానాడుకు పవన్ హాజరు కావాలని టిడిపి పార్టీ అభిలషిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పవన్ కు ఆహ్వానం పంపినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే మహానాడు మూడు రోజుల పాటు జరుగుతున్న నేపధ్యంలో అన్ని రోజులు హాజరయితే సంతోషకరమని, లేని పక్షంలో దివంగత ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జన్మదినం మే 28న అయినా హాజరు కావాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం కోరింది. అయితే ఈ ఆహ్వానంపై ఇంకా పవర్ స్టార్ ఎటువంటి స్పందనా తెలియజేయలేదని సమాచారం.
source : http://www.netiap.com/

No comments:
Post a Comment