గత ఏడాది కాలంగా చిరంజీవి 150 వ సినిమా ఇప్పుడు అప్పుడు అంటూ దాటవేస్తూ వస్తున్నారు. ఫైనల్ గా ఇప్పుడు చిరంజీవి 150 వ సినిమాకు సమయం వచ్చినట్టే అని మెగా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కథ కుడా కుదిరిందని, దర్శకుడు ఎవరా అనే విషయం పై మంతనాలు జరుగుతున్నాయని తెలిసింది. ఇప్పటికే పూరి జగన్నాధ్, వినాయక్ ల పేర్లు వినిపిస్తున్నాయి. మరో వైపు త్రివిక్రమ్ పేరు కుడా వినిపిస్తుంది. ఏది ఏమైనా చిరంజీవి జన్మదినం అంటే ఆగస్ట్ 22 న చిరు 150 వ సినిమా ప్రారంబించాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబందించిన అధికారిక వార్తలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

No comments:
Post a Comment