Friday, 17 April 2015

తండ్రి చిత్రం నుండి స్పూర్తి పొందుతున్న రామ్ చరణ్


రామ్ చరణ్ తన తదుపరి సినిమా కోసం థ్రిల్స్ నేర్చుకునే పనిలో బ్యాంకాక్ పయనమైన సంగతి తెలిసినదే. ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ రాజు’ అనే పేరుని పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో చెర్రి స్టంట్ మాస్టర్ గా కనిపించనున్నాడు.
సమాచారం ప్రకారం ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి ‘విజేత’ సినిమానుండి స్పూర్తి పొందారట. ఆ సినిమాలో చిరు ఫుట్ బాల క్రీడాకారుడిగా నటించి తన కెరీర్ ని కుటుంబం కోసం త్యాగం చేస్తాడు.
ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ సైతం చెల్లెలి కోసం ఇదే విధంగా కష్టపడతాడని తెలుస్తుంది. కన్నడ బ్యూటీ కృతి కర్బంద చరణ్ చెల్లెలిగా నటిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. థమన్ సంగీత దర్శకుడు. డి.వి.వి దానయ్య నిర్మాత.

No comments:

Post a Comment