ఆంధ్ర ప్రదేశ్ రాజదాని ప్రాంతమైన తుళ్ళూరు లో రాజధాని భూసేకరణ విషయంలో రైతులు తీవ్రంగా ప్రతిఘటించడం తో జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారికి మద్దతుగా నిలిచాడు. అంతేకాకుండా తుళ్ళూరు ప్రాంతంలో పర్యటించి తాను మద్దతు తెలిపిన టీడీపీ ప్రభుత్వానికే వ్యతిరేకంగా గట్టి హెచ్చరికలు పంపారు. అయితే తాజాగా భోగాపురం ఎయిర్ పోర్ట్ కోసం 15వేల ఎకరాలు, కృష్ణా జిల్లా లో పర్యాటక అభివృద్దికి 12 వేల వ్యవసాయ భూమిని రైతుల నుంచి తీసుకునేందుకు అదికార టీడీపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. దీంతో టీడీపీ తీసుకుంటున్న ఈ నిర్ణయాలకు పవన్ మరో సారి ప్రశ్నిస్తారా? రైతులకు అండగా పవన్ నిలబడతారా?

No comments:
Post a Comment