పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఈ పేరంటే ఒక ప్రభంజనం. పవన్ కళ్యాణ్ ఒక నటుడిగా అభిమానులను, తెలుగు సినీ ప్రేక్షకులను ఎలా అలరించాడో అలాగే జనసేన పార్టీ తరపున తెలుగు ప్రజల కష్టాలను తీర్చడానికి ముందడుగు వేస్తున్నారు. కాసేపు రాజకీయాలను పక్కన బెట్టి సినిమాల విషయానికి వస్తే కెరీర్ ప్రారంభం నుంచి పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. అలా పవన్ కెరీర్లో మరపురాని మైలురాయిగా నిలిచిపోయిన సినిమా ‘బద్రి’.
ఈ సినిమా విడుదలై నేటితో 15 సంవత్సరాలు రిలీజ్ అయ్యింది. కానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చూపించిన మానరిజం (మెడ దగ్గర చేయి పెట్టి చిరుతపులిలా చూడడం) ఇప్పటికీ సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ అందులో చెప్పిన ‘నువ్వు నందా అయితే నేను బద్రి బద్రినాథ్’ అనే డైలాగ్ ఇంకా తెలుగు ప్రేక్షకుల నోటి నుంచి వస్తూనే ఉంది. అంతలా ట్రెండ్ సెట్ చేసిన ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికి 15 సంవత్సరాలు పూర్తవడంతో ఈ మూవీ డైరెక్టర్ పూరి జగన్నాధ్, పవన్ ఫ్యాన్స్ తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో ఎక్స్ ప్రెస్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన రేణు దేశాయ్, అమీషా పటేల్ హీరోయిన్స్ గా నటించగా నంద పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించాడు.

No comments:
Post a Comment