‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో, ‘రేసుగుర్రం’ లాంటి సూపర్ హిట్‌తో జోరు మీదున్న అల్లు అర్జున్ నటించిన చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి. ప్రచార చిత్రాలు, ట్రైలర్ ద్వారా ఇప్పటికే ప్రేక్షకుడిలో ఆసక్తిని రేకెత్తించిన సన్నాఫ్ సత్యమూర్తి, విడుదలకు ముందే సంచనాలను నమోదు చేసింది. సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి.
ఇక తాజాగా ఈ ఉదయం సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ మార్క్ ఫైట్లు కూడా ఉన్నాయి. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు ‘యూ/ఏ’ సర్టిఫికేట్ జారీ చేశారు. దీంతో ఇక సినిమాకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్టే! ఇప్పటికే విడుదలైన ఆడియో ప్రేక్షకుల్లో మంచి హుషారును నింపింది. ఇక ట్రైలర్‌లో అల్లు అర్జున్ స్టైల్, త్రివిక్రమ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమాను ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

No comments:
Post a Comment