గబ్బర్ సింగ్ 2 కు హీరోయిన్ గా ఎంపికై అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది అనీషా అంబ్రోస్. అసలు హీరోయిన్ ఎంపిక కారణంగానే ఆది నుంచి గబ్బర్ సింగ్ 2 ఆలస్యమైన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమై సంగతి బయటకు వచ్చింది. గబ్బర్ సింగ్ 2 తాజా డైరకర్ట్ రవీంద్ర (బాబి), హీరోయిన్ అనీషా అంబ్రోస్ కు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాడట. నటన, డ్యాన్స్ లు ఇంకా అనేక ఇతర విషయాల్లో అనీషాకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారట. కానీ గబ్బర్ సింగ్ 2 సినిమా అనీషాకు అన్ని విధాలా మంచి సినిమా కావాలని, ఆమె కెరీర్ టర్న్ తీసుకోవాలని ఈ శ్రద్ధ తీసుకుంటున్నారని వినికిడి.గబ్బర్ సింగ్ 2 స్టోరీ లైన్ ను పవన్ కళ్యాణ్ స్వయంగా తయారు చేసిన సంగతి తెలిసిందే. అందులో హీరోయిన్ కు కూడా మాంచి ప్రాధాన్యత వుండేలా డిజైన్ చేసారట. దాంట్లో చాలా షేడ్ లు వున్నాయట. అలాంటి పాత్రకు పెద్ద పెద్ద హీరోయిన్లను కాదని, ఓ అప్ కమింగ్ హీరోయిన్ ను తీసుకోవడం అన్నది రాంగ్ అన్న మాట రేపు సినిమా విడుదలయ్యాక రాకూడదు అన్నది పవన్ ఆలోచనగా తెలుస్తోంది. అందుకే అన్ని విధాలా అనీషాకు శిక్షణ ఇచ్చే బాధ్యతను డైరక్టర్ రవీంద్ర మీద వుంచాడట.

No comments:
Post a Comment