మెగాస్టార్ చిరంజీవి బుల్లితెరపై మెరవనున్నారు. నాగార్జున 'మీలో ఎవరు కోటీశ్వరుడు' రియాల్టీ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కౌన్ బనేగా కరోడ్ పతి కి తెలుగు వెర్షన్ అయిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో వీక్షకులను ఎంతగానో అలరిస్తోంది.
తాజాగా ఈ కార్యక్రమానికి చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా రానున్నారు. ఈ ఎపిసోడ్ ఆగస్ట్ 3వ తేదీన ప్రసారం కానుంది. ఇటీవలి ఆ షో చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక తమ అభిమాన హీరోలు ఇద్దరూ ఒకే వేదికపై కనువిందు చేయటం నాగ్, చిరుల అభిమానులకు పండుగే. ఇప్పటికే ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటి విద్యాబాలన్, శ్రేయ, లక్ష్మి మంచు, అల్లరి నరేష్, యాంకర్స్ ఝాన్సీ, సుమ తదితరులు గెస్ట్ లుగా విచ్చేశారు. ఇక చిరంజీవి ప్రస్తుతం తన 150 సినిమాపై కసరత్తు చేస్తున్నారు. ఆగస్ట్ 22న చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా విశేషాలు వెల్లడించనున్నట్లు సమాచారం.

No comments:
Post a Comment