Tuesday, 21 April 2015

చిరు సినిమా టైటిల్ అదేనా?


ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి త్వరలో 150వ సినిమా చెయ్యబోతున్నట్లు గత కొద్ది కాలంగా కధనాలు వినిపిస్తూనే ఉన్నాయి.ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది అంటూనే చిరు చిత్రం ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదు.ఇక తాజాగా చిత్ర నిర్మాణానికి పలువురు దర్శకుల పేర్లు తెర పైకి వచ్చినప్పటికీ కమర్షియల్ సినిమాల సక్సెస్ ఫార్ములాతో దూసుకుపోతున్న డైరెక్టర్ పూరీ జగన్నాధ్ చేతికే ‘మెగా’ ఫోన్ పగ్గాలు దక్కిన్నట్లు వార్తలు వెలువడ్డాయి.అయితే ఇప్పుడు చిరు 150వ చిత్రానికి ఏ టైటిల్ పెట్టబోతున్నారనే అంశంపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక ఈ నేపధ్యంగా చిరంజీవి చిత్రం కోసం పూరి జగన్నాధ్ ‘ఆటో జానీ’ పేరును రిజిస్టర్ చేయించినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే త్వరలోనే చిరు 150వ సినిమా పేరుపై క్లారిటీ రాబోతున్నట్లు సమాచారం.కాగా చిరంజీవి పుట్టిన రోజు ఆగస్టు 22 కల్లా ఈ చిత్రంపై పూర్తి స్పష్టత వస్తుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక రాజకీయ సందేశాలకు దూరంగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో చిరు 150వ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం.

No comments:

Post a Comment