స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘S/O సత్యమూర్తి’ సినిమా ఈ గురువారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎక్కువగా ఆకట్టుకుంటున్న ఈ సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఇది కాకుండా అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాని బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేయనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ చివర్లో లేదా మే లో మొదలు కానుంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ కోసం పలువురు పేర్లు వినిపించాయి. సయేషా సైగల్, సమంత ల పేర్లు వినిపించినా కానీ ఇంకా ఎవరు ఖరారు కాలేదు.
టీవీ నటి నుంచి హీరోయిన్ గా మారిన మహారాష్ట్ర ముద్దుగుమ్మ సోనారిక. సోనారిక ప్రస్తుతం నాగ శౌర్య నటించిన ‘జాదూగాడు’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. అందులో ఓ హీరోయిన్ గా సోనారిక ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే సోనారికని ఒక హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఒకవేళ సోనారిక ఎంపికైతే కెరీర్ ప్రారంభంలోనే బంపర్ ఆఫర్ కొట్టేసిన హీరోయిన్ అవుతుంది. మరి ఈ భామకి అల్లు అర్జున్ సరసన నటించే ఛాన్స్ వస్తుందా లేదా అన్నదాని కోసం మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మించనున్న ఈ సినిమాకి ఎస్.ఎస్.తమన్ సంగీత దర్శకత్వం వహిస్తారు.

No comments:
Post a Comment