స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ – ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ప్రమోషన్ సాంగ్ అదిరిపోయేలా చేశారు. ఈ ప్రమోషన్ సాంగ్ టీజర్ కు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వస్తోంది. అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై వస్తోన్న సన్ ఆఫ్ సత్యమూర్తి ప్రమోషనల్ సాంగ్ టీజర్ రిలీజ్ అయింది. ఈ చిత్రం ట్రైలర్‌కు భారీ స్పందన వస్తోంది.
బన్నీ హీరోగా నటించిన ఈ సినిమా కుటుంబ కథా చిత్రంగా ఉండబోతోంది. ఈ చిత్రంలో సమంత, నిత్యా మీనన్, ఆదా శర్మ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, ఉపేంద్ర, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు.

No comments:
Post a Comment